నేనెవరంటే.. పెద్దగా చెప్పుకునేంత ఏమీ లేదు. ప్రతీ తెలుగోడు తన జన్మ హక్కు కింద చేసే పనే చేస్తుంటాను. తినటానికి బ్రతకటం అన్నా దానిని నిజం చేయటానికే ఉన్నానా అన్నట్టు జీవిస్తుంటాను. కోటి రూపాయలు సంపాదించటం కన్నా తోటలో కరివేపాకు తుంచటం ఎక్కువ ఆనందిస్తాను. ఎప్పటికైనా ప్రపంచం మెచ్చుకునే తోట పని చేసేవాడిగా అవ్వాలని తెగ కలలు కంటూ ఉంటాను. మంచి సినిమాలు చూస్తూ ఆస్వాదిస్తూ , వేరే సినిమాలు కూడా చూస్తూ , వాటిని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాను. తెగ వ్రాసేయాలని ఉబలాటపడిపోయినా, బుర్రలో అంత గుంజు లేదు కాబట్టి అర కొర వ్రాసి తెగ ఫీలయ్యి పోతూ ఉంటాను. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రక్రుతి మధ్య బ్రతకటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాను . వర్షం వచ్చినప్పుడు పకోడీలు , చలి పెట్టినప్పుడు వేడి వేడి సూప్, ఎండాకాలంలో చల్లటి తీయటి రోజ్ మిల్క్ తాగాలనే అతి అధమమైన ఆలోచనల సమాహారం క్లుప్తంగా చెప్పాలంటే
0 Comments:
Post a Comment
<< Home